News August 16, 2025

అల్లూరి జిల్లా ఎస్పీ, జేసీలకు ప్రశంసాపత్రాలు

image

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రశంసాపత్రాలు, అవార్డులను అందుకున్నారు. పాడేరులో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ వాటిని అందించారు. అలాగే పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అదనపు ఎస్పీ ధీరజ్, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

Similar News

News August 16, 2025

తాంసి: రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి

image

శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని తాంసి మండలం కప్పర్ల రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశాల్ శ్రీ రాముడిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న రాముడి రూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

News August 16, 2025

సంగారెడ్డి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్‌గా వాతావరణ శాఖ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

News August 16, 2025

బాపట్లలో గౌతు లచ్చన్నకు నివాళి

image

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా అన్నారు. ఆయన జయంతి సందర్భంగా బాపట్ల చీల్ రోడ్డు వద్ద ఉన్న లచ్చన్న విగ్రహానికి వివిధ శాఖల అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు, తన జీవితాన్ని అంకితం చేసిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు.