News April 24, 2024
అల్లూరి జిల్లా కలెక్టర్‌ను కలిసిన క్రికెటర్ రవని

అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీతను అంధుల క్రికెటర్ వలసనేని రవని కలిశారు. ఆల్ ఇంగ్లాండ్ అంధుల క్రికెట్ ప్రపంచ పోటీలలో గెలిచిన టీంలో ఈమె సభ్యురాలిగా ఉన్నారు. ఆల్ రౌండ్ ప్రతిభతో 2023లో బంగారు పతకం సాధించారు. రవని కుటుంబ సభ్యులు పరిస్థితులు, మెరుగైన క్రికెట్ ఆడేందుకు అవసరమైన సాయం చేయాలని విన్నవించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఓట్లు వేసేందుకు యువతను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమెకు సూచించారు.
Similar News
News April 21, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 113 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 113 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు. ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.
News April 21, 2025
V.M.R.D.Aకు ఇన్‌ఛార్జ్ కమిషనర్

V.M.R.D.A. మెట్రోపాలిటన్ కమిషనర్ K.S. విశ్వనాథన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (M.M.R.D.A.) కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సోమవారం ముంబై వెళ్లారు. 22వ తేదీన కూడా ఆయన అధ్యయనం ముంబైలో ఉంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ని ఇన్ ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 21, 2025
ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.