News December 10, 2025
అల్లూరి జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా వాహన ప్రమాదాల నివారణకు గత వారం రోజులుగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించామని జిల్లా ఏఎంవీఐ సాయి రమేశ్ మంగళవారం తెలిపారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 12 జీపులకు రూ.80,330 చలానా విధించామన్నారు. అధిక ధరలు, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని మూడు జీపులను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించామన్నారు.
Similar News
News December 10, 2025
చొప్పదండి: సర్పంచ్ బరిలో ఒకే పేరున్న ముగ్గురు పోటీ

సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు వేర్వేరుగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు ఒకేవిధంగా ఉన్నా ఇంటి పేర్లు మాత్రం వేరుగా ఉంటాయి. అలాంటీ సీనే చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో నెలకొంది. ఇక్కడ శ్రీనివాస్ అనే పేరున్న(ఇంటి పేర్లు వేరు) ముగ్గురు అభ్యర్థులు గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. దీంతో ఏ శ్రీనివాస్ గెలుస్తాడోనన్న ఆసక్తి మాత్రం మండల వ్యాప్తంగా ఉంది.
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లా పరిధిలోని మూడు దశల్లో 869 గ్రామపంచాయతీలో జరిగే ఎన్నికలకు 1,680 పోలీస్ సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే 100కి సమాచారం అందించాలని కోరారు.
News December 10, 2025
వరంగల్: పేర్లు లేవు.. కేవలం గుర్తులే!

స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడడంతో అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. కాగా, బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థులకు సంబంధించిన పేర్లు ఉండవు. కేవలం గుర్తులు ఉంటాయి. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఎన్నికల సంఘం ప్రత్యేక గుర్తులను కేటాయించింది. దీంతో అభ్యర్థులు ఓటర్లకు తమ గుర్తుల మీదనే ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. బ్యాలెట్ పేపర్లలో పేర్లు లేకపోవడంతో అభ్యర్థులకు తిప్పలు తప్పేలా లేవు.


