News February 25, 2026
అల్లూరి: డోలీ మోత.. దారిలోనే ప్రసవం

అనంతగిరిలో మరో డోలీ మోత ఘటన గిరిజనులు పడుతున్న దుర్భర పరిస్థితిని అద్దం పడుతోంది. మల్లిపాడుకు చెందిన గొల్లూరి సుమిత్రకు పురిటి నొప్పులు రాగా (25) బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మార్గమధ్యంలో ప్రసవమైంది. రోడ్డు సౌకర్యం లేక 6 కిలోమీటర్లు డోలీ మోతతో గ్రామస్థులు తీసుకొని వెళ్తుండగా ప్రసవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News February 28, 2026
చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.
News February 28, 2026
రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు TMC ప్రకటించిన జాబితాలో మేనకా గురుస్వామి ఎంపిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. LGBTQ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గానికి చెందినవారు. హోమో సెక్సువాలిటీని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377ను సుప్రీం కొట్టేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె RSకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టిస్తారు.
News February 28, 2026
VKB: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు: SP

వికారాబాద్ జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్ నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించి క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని నొక్కి చెప్పే అనేక సూచనలు చేశారు. క్రమం తప్పకుండా పరేడ్‌లను నిర్వహించడం వల్ల క్రమశిక్షణ, సమయపాలన పరస్పర సమన్వయం పెరుగుతుందని పేర్కొన్నారు. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు.


