News January 20, 2026
అల్లూరి: తరాలు మారినా.. మారని గిరిజనుల తలరాతలు

తరాలు మారుతున్నా ఆదివాసీల తలరాతలు మారటం లేదు. కాలం ఏదైనా గిరిజనులకు డోలీ మోతలు తప్పటం లేదు. సోమవారం పెదబయలు మండలంలోని బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామంలో అనారోగ్యానికి గురైనా పోయిబ రాములమ్మను డోలీలో ఆస్పత్రికి తరలించిన దృశ్యం గిరిజనుల అవస్థలకు అద్దం పడుతోంది. గ్రామంలో సెంగెరెడ్డ వీధికు సరైనా రోడ్డు సదుపాయం లేకపోవడంతో డోలీ ద్వారా రాములమ్మను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 10, 2026
యాదాద్రి: ఈనెల 12 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12 నుంచి శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. అందులో 12న స్వస్తి వచనం, 13న ధ్వజారోహణం, దేవతాహ్వానం, 14న రుద్రహవనం, శివపార్వతుల కళ్యాణం, 15న మహాశివరాత్రి, శతరుద్రాభికాలు, 16న లక్ష బీల్వార్చన, రథోత్సవం, 17న పూర్ణాహుతి, త్రిశూల తీర్థతో ఉత్సవాలు ముగియనున్నాయి.
News February 10, 2026
డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 10, 2026
జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.


