News December 1, 2025
అల్లూరి: నిర్వాసితులకు రేషన్ కష్టాలు.. 290 కి.మీ ప్రయాణం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రేషన్ పంపిణీ విషయంలో స్థానికత సమస్య ఎదురవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రేషన్ బదిలీ కావడం లేదు. ఏలూరు జిల్లా నుంచి బియ్యం ఇవ్వడం లేదు. దీంతో నిర్వాసితులు పాత గ్రామానికి సుమారు 290 కిలోమీటర్లు ప్రయాణించి, వేల రూపాయల కిరాయి చెల్లించి రేషన్ తెచ్చుకుంటున్నారు. పునరావాస గ్రామాలను పోలవరం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News April 15, 2026
గోదావరి జిల్లాల విభజనకు 101 ఏళ్లు

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధి చాలా విస్తృతంగా ఉండటం వల్ల, 1920వ దశకంలో దానిని రెండుగా విభజించాలనే ప్రతిపాదన వచ్చింది. 1925 ఏప్రిల్ 15న బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 502 ప్రకారం ఉమ్మడి జిల్లాను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. ఈ విభజనలో కాకినాడ తూర్పు గోదావరికి, ఏలూరు పశ్చిమ గోదావరికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఈ విభజనకు నేటితో 101ఏళ్లు పూర్తయ్యాయి.
News April 15, 2026
విశాఖ జూలో సింహం మృతి

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.
News April 15, 2026
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వసూళ్లు చేస్తే క్రిమినల్ కేసులు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. మంథనిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మే నెలలో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్మాణ పురోగతి ఆధారంగానే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.


