News January 24, 2026
అల్లూరి: నేటి నుంచి యథావిధిగా బస్‌లు

అల్లూరి, పోలవరం, అనకాపల్లి జిల్లాలకు శనివారం ఉదయం నుంచి యథావిధిగా బస్‌లు నడుస్తాయని ఏలేశ్వరం RTC DM జీవి సత్యనారాయణ తెలిపారు. ఏలేశ్వరం, జె. అన్నవరం రోడ్డు నిర్మించాలని కోరుతూ ప్రజా సంఘాలు 2 రోజులుగా నిరసన కార్యక్రమం జరగడంతో బస్‌లు నిలిపివేశామన్నారు. అడ్డతీగల, వై.రామవరం, నర్సీపట్నం, కొయ్యూరు, రాజవొమ్మంగి తదితర ప్రాంతాలకు బస్ సర్వీస్‌లు నడుస్తాయని వెల్లడించారు.
Similar News
News February 21, 2026
గాలి ఉండగానే తూర్పారబోయాలి

ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి రైతులు గాలి వచ్చే దిశలో ధాన్యాన్ని పై నుంచి కిందకు పోస్తారు. దీనినే తూర్పారబట్టడం అంటారు. గాలి బలంగా ఉన్నప్పుడు ఇది చాలా సులభంగా, వేగంగా పూర్తవుతుంది. గాలి లేనప్పుడు ప్రయత్నిస్తే పొట్టు సరిగా విడిపోదు, కష్టం వృథా అవుతుంది. జీవితంలో కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు లేదా గొప్ప అవకాశాలు ఎల్లప్పుడూ ఉండవు. అవి లభించినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని ఈ సామెత చెబుతుంది.
News February 21, 2026
స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్!

TG: రాష్ట్రంలోని స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ సరఫరా చేయాలని సివిల్ సప్లయ్స్ శాఖ నిర్ణయించింది. స్టీమ్ రైస్‌తో విద్యార్థులకు అందించే ఫుడ్ నాణ్యత పెరుగుతుందని ఆ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. దీనితో రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. మిల్లులో ఆడించకముందే ఆవిరితో ప్రాసెస్ చేయడం వల్ల స్టీమ్ రైస్ గింజలు విరగవు. అన్నం రుచిగా, పొడిగా ఉంటుంది.
News February 21, 2026
పెండింగ్ ఉంటే కుదరదు: గద్వాల్ కలెక్టర్

జిల్లాలో భూభారతి దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల కలెక్టరేట్‌లో తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో.. జిల్లా వ్యాప్తంగా 1,370 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సంబంధిత మండల అధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.


