News March 27, 2025

అల్లూరి: నేడు ఈ 10 మండలాల ప్రజలు జాగ్రత్త

image

అల్లూరి జిల్లాలలో నేడు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఆర్. కూర్మనాథ్ బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్డతీగల, చింతూరు, దేవిపట్నం, గంగవరం, కొయ్యూరు, కూనవరం, నెలిపాక, రాజవొమంగి, రంపచోడవరం, వరరామచంద్రపుర్ లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు.

Similar News

News December 19, 2025

వనరాజా కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

పెరటి కోళ్ల పెంపకానికి ‘వనరాజా’ మరో అనువైన రకం. ఇవి అధిక సంఖ్యలో గుడ్లు, అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. ఆకర్షణీయమైన రంగులో ఈకలను కలిగి ఉంటాయి. 10-12 వారాల వయసులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5 నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్నిస్తాయి. పెట్టకోడి ఏటా 150 గుడ్లను పెడుతుంది. ఇది కుక్కలు, పిల్లుల బారి నుంచి త్వరగా తప్పించుకుంటుంది.

News December 19, 2025

కదిరిలో మెగా అంజాద్‌పై PD Act అమలు

image

కదిరి టౌన్ పీఎస్ పరిధిలో తీవ్ర నేరాలకు పాల్పడుతున్న కౌలేపల్లి అంజాద్‌ ఖాన్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. కదిరి జోకుపాళ్యంలో నివాసముంటూ రాయలసీమ సర్కిల్‌లో బట్టల వ్యాపారం చేస్తున్న అంజాద్‌ నకిలీ పత్రాలతో భూ కబ్జాలు, గొడవలు, పలు కేసుల్లో ఉండటం, సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులతో ప్రజాశాంతికి భంగం కలిగించినట్లు గుర్తించారు. అంజాద్‌పై 15 కేసులు ఉండగా కడప జైలుకు తరలించారు.

News December 19, 2025

మాట నిలబెట్టుకున్న కమలాపురం MLA

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో మన కడప జిల్లా అమ్మాయి శ్రీచరణి సత్తాచాటిన విషయం తెలిసిందే. ఆమెకు రూ.5లక్షలు ఇస్తానని అభినందన సభలో కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో కలిసి గురువారం తన కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రపంచ కప్ గెలిచి కమలాపురం నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు.