News May 7, 2025

అల్లూరి: పది పాసైన విద్యార్థులకు అలెర్ట్

image

2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 8 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూపులు, వొకేషనల్ కోర్సుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీవో అభిషేక్ శుక్రవారం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఈనెల 26నుంచి మే 18లోగా www.aptwgurukulam.ap.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. >Share it

Similar News

News April 5, 2026

నిజామాబాద్: వడ్ల ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

image

భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందాడు. వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు శ్రీనివాస్(45) ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న ఎస్సై తిరుపతి ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 5, 2026

భీమవరం కలెక్టరేట్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల రహిత సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

ఏలూరులో జగ్జీవన్ రామ్ జయంతి

image

ఏలూరు జిల్లా కేంద్రంలోని గౌతమి సమావేశ మందిరంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ మాజీ ఉప ప్రధానిగా, సంఘ సంస్కర్తగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.