News February 27, 2026

అల్లూరి: పది విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు రేపే ఆఖరి గడువు

image

పదో తరగతి విద్యార్థులు నామినల్ రోల్స్ వివరాలు మార్పులకు ఫిబ్రవరి 28తో గడువు ముగుస్తుందని అల్లూరి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ శుక్రవారం తెలిపారు. విద్యార్థి, పేరెంట్స్ పేర్లులో మార్పులు, కులం, ఉపకులం, ఫోటో, సంతకం మార్చుకునే అవకాశం ఉందన్నారు. హెచ్ ఎం యూ డైస్ ప్లస్ యాప్‌లో లాగిన్ అవ్వాలని సూచించారు. జిల్లాలో 264 ఉన్నత పాఠశాలల్లో 11,457 మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

Similar News

News March 1, 2026

ఈరోజు నమాజ్ వేళలు (01-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.46 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 1, 2026

నాగిరెడ్డిపేటలో సినిమా షూటింగ్

image

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గువ్వల చెరువు ఘాట్ అనే సినిమా షూటింగ్ నిర్వహించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్‌ను తిలకించారు. సినిమా నిర్వాహక మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 8 వరకు ఇక్కడ షూటింగ్ ఉంటుందన్నారు.

News March 1, 2026

మార్చి 3న సింహాచలంలో దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

image

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర్శనాలతో పాటు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.