News March 16, 2025
అల్లూరి: పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. అడ్డతీగల, అనంతగిరి, శివలింగంపురం, కొత్త బల్లుగూడ, చింతపల్లి, మోతుగూడెం, దేవీపట్నం, డుంబ్రిగూడ, జి. మాడుగుల, గూడెం, సీలేరు, బాకూరు, కూనవరం, నరసింగపేట, బోదులూరు, జోలాపుట్, సింగంపల్లి, గౌరీదేవిపేట, ఎస్‌విగూడెం, వై రామవరంలో కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News March 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 17, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 17, 2025
నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఖానాపూర్, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బయల్దేరుతుందని వెల్లడించారు.
News March 17, 2025
ADB: అగ్ని వీర్ రిక్రూట్మెంట్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

‘అగ్నిపథ్’ స్కీం క్రింద అగ్ని వీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ www.joinindianarmy.nic.in అధికారిక వెబ్ సైట్లో ప్రారంభమైందని ఆదిలాబాద్ డీఐఈఓ జాదవ్ గణేశ్ తెలిపారు. అగ్నివీర్‌లోని వివిధ కేటగిరీల కింద నియామకాలు జరుగుతున్నాయన్నారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.