News March 7, 2026

అల్లూరి: పోలిసు స్టేషన్‌కు చేరిన టెన్త్ పేపర్స్

image

అల్లూరి జిల్లాలో 12 పోలిసు స్టేషన్స్‌కు శనివారం పదోతరగతి పరీక్ష పేపర్స్ చేరాయని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. సెట్ నంబర్ 1పేపర్స్ మొదట విడత వచ్చాయన్నారు. జిల్లాలో 159 పాఠశాలలకు చెందిన 7,299మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరి కోసం 44 సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.

Similar News

News April 12, 2026

చైనాకు ట్రంప్ వార్నింగ్

image

ఇరాన్‌కు చైనా ఆయుధాలు పంపే అవకాశం ఉందన్న అమెరికా <<19628773>>నిఘా వర్గాల<<>> హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. చైనా అలా చేస్తే పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌తో చర్చల్లో విజయం తమదేనని అన్నారు. ‘చర్చల్లో ఒప్పందం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అదంతా పట్టించుకోను. గెలిచేది మనమే. నౌకలు మన దేశం వైపు బయల్దేరుతున్నాయి. భారీ ట్యాంకర్లలో చమురు, గ్యాస్ నింపుతున్నాం’ అని చెప్పారు.

News April 12, 2026

సంగారెడ్డి: శివాలయంలో నాగుపాము

image

హత్నూర మండలం కాసాల గ్రామంలోని వెయ్యేళ్ల పురాతన మల్లన్న శివాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. గర్భగుడిలోని శివలింగంపై పాము పడగవిప్పి ఉండటంతో గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు బారులు తీరారు.

News April 12, 2026

ఎలమంచిలిలో భారీ జాబ్ మేళా.. ఎప్పుడంటే?

image

ఎలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేళాలో ఫాక్సికాన్, అపోలో టైర్స్, టాటా జాస్మిన్ సహా 8 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా హాజరుకావాలని సూచించారు.