News January 27, 2026
అల్లూరి: మద్యం మత్తులో అన్నంలో విషం కలిపి తిని వ్యక్తి మృతి

చింతూరు(M) పేగ పంచాయతీ ఇర్కంపేటలో సోమవారం రాత్రి ఎం.కోసయ్య(45) అనే వ్యక్తి మద్యం మత్తులో అన్నంలో పక్షులను వేటాడే మందు కలిపి తిన్నాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అతనిని భార్య అంబులెన్సులో ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అదే ఇంట్లో 2 నుంచి 8 సం. వయస్సుగల అయిదుగురు పిల్లలు, ఓ మహిళ అదే అన్నం తిని మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Similar News
News February 7, 2026
MBNR: నేడు పరీక్ష.. 4,592 మంది పోటీ

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతిలో మిగులలు సీట్ల భర్తీకి నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో 4,592 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు వట్టెం ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
News February 7, 2026
రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.
News February 7, 2026
అన్నమయ్య: వేలాది కోళ్ల మృతి.. కారణం ఇదే..!

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.


