News December 13, 2025

అల్లూరి: మొదటిసారి తీసుకున్న నిర్ణయం.. 9 మంది మృతి

image

అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం 9మంది ఆయువు తీసింది. అల్లూరి బస్సు ప్రమాద ఘటనలో.. ట్రావెల్స్ యజమాని 1993 నుంచి ఈ రంగంలో ఉన్నారు. పన్నీరుసెల్వం వజ్రమణి(ఏజెంట్) ద్వారా యాత్రలు చేపడుతుంటాడు. 22 ఏళ్లలో ఎప్పుడూ వజ్రమణి రాత్రి ప్రయాణం చేయలేదట. టూర్ ఆలస్యం కావడంతో మొదటిసారి రాత్రి ప్రయాణం చేశారంట. భద్రాచలం యాత్ర సైతం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమంట. పొగమంచు, అతివేగం సైతం 8 కుటుంబాల్లో విషాదం నింపింది.

Similar News

News December 17, 2025

అలిపిరి వద్ద అపచారం.. TTD చర్యలు

image

అలిపిరి సమీపంలోని TTD భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం సీసాలు, మాంసం లభ్యమవడం కలకలం రేపింది. దర్శన టికెట్లు జారీ చేసే ప్రాంతంలోనే ఇవి గుర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. TTD విజిలెన్స్ నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన TTD అధికారులు.. భూదేవి కాంప్లెక్స్‌లో విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News December 17, 2025

బర్త్‌డే విషెస్.. CBN, పవన్‌కు షర్మిల థాంక్స్

image

AP: పీసీసీ చీఫ్ షర్మిలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ Xలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ పీసీసీ చీఫ్ రిప్లై ఇచ్చారు. అటు వైసీపీ చీఫ్ జగన్ షర్మిలకు విషెస్ చెప్పకపోవడం గమనార్హం.

News December 17, 2025

నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించండి: పురందీశ్వరి

image

RJY, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో గతంలో నిలిపిన రైళ్లను పునఃప్రారంభించాలని రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి కోరారు. బుధవారం పార్లమెంట్‌‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కోవిడ్‌ అనంతరం రద్దయిన రైలు హాల్టింగ్‌లను పునరుద్ధరించాలని, రానున్న పుష్కరాల దృష్ట్యా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు.