News July 11, 2025
అల్లూరి: ‘రూ.1,000 కోట్లతో అభివృద్ధి’

పాడేరు కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలానికి 100 గోకులాల ఏర్పాటు, ROFR పట్టాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా పది కుటుంబాలకు స్వయంగా మార్గదర్శిగా నిలిచారు. ఆర్గానిక్ వ్యవసాయం, పర్యాటక అభివృద్ధి, రూ.1000 కోట్లతో రహదారి, ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
Similar News
News August 31, 2025
WNP: బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి

బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లుకు బీఆర్ఎస్, బీజెపి సహకరించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి. కాంగ్రెస్ కేంద్రంలో పవర్లో ఉన్నప్పుడే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది. బీసీ మంత్రిపై బీఆర్ఎస్ బీసీ నేత తప్పుగా మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.
News August 31, 2025
శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారు: లలిత్

IPL-2008 సమయంలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన వీడియో బయట పెట్టడంపై <<17559909>>శ్రీశాంత్ భార్య<<>> ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై లలిత్ మోదీ స్పందించారు. ‘శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారో నాకర్థం కాలేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఏం జరిగిందనే నిజాన్ని షేర్ చేశా. శ్రీశాంత్ బాధితుడు. నేను సరిగ్గా అదే చెప్పా. గతంలో నన్నెవరూ ఈ ప్రశ్న అడగలేదు. క్లార్క్ అడిగితేనే స్పందించా’ అని తెలిపారు.
News August 31, 2025
జంగారెడ్డిగూడెం: కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించని విషయం తెలిసిందే. మధ్యాహ్నపువారి గూడెం కాలువలో ఆదివారం ఉదయం ఆయన బైక్ గుర్తించారు. ఈక్రమంలో గజ ఈతగాళ్లతో వాగు మొత్తం గాలించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.