News February 25, 2025

అల్లూరి: రెండు రోజులు లిక్కర్ షాపులు బంద్

image

అల్లూరి జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులు మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రం నుంచి మూసి వేయించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి 48 గంటలపాటు లిక్కర్ షాపులు మూసివేయాలని దుకాణదారులను అధికారులు ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు నిర్వహించరాదని హెచ్చరించారు.

Similar News

News February 26, 2025

పశ్చిమగోదావరిలో TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లా రెండు రోజులపాటు జిల్లాలో వైన్ షాపుల బంద్
✷ జిల్లాలో మొదలైన శివరాత్రి ఉత్సవాలు 
✷ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
✷ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించిన కలెక్టర్
✷ మొగల్తూరులో చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష
✷ నర్సాపురం శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

News February 26, 2025

నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

image

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.

News February 26, 2025

శతశాతం ఈ-పంట నమోదు చేయాలి: కలెక్టర్ 

image

జిల్లాలో శత శాతం ఈ-పంట నందు నమోదు చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయశాఖకు సంబంధించి ఈ-పంట నమోదుపై మండలాల వారీగా మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 32వేల ఎకరాలకు సంబంధించి 84 శాతం నమోదు పూర్తయిందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి శతశాతం పూర్తిచేయాలని సూచించారు.

error: Content is protected !!