News April 7, 2025
అల్లూరి: రెట్టింపైన మిరియాలు ధర

అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్న మిరియాల రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది కిలో రూ.350 పలుకగా నేడు రూ.600కి రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెదబయలు, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అధిక ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 11, 2025
కొత్తగూడెం: గ్రేట్.. 88 లక్షల మొక్కలు పంపిణీ

గత 38 ఏళ్లుగా ప్రకృతితో స్నేహం చేస్తూ దాదాపుగా 88 లక్షల మొక్కలను మొక్కల వెంకటయ్య పంపిణీ చేశారు. ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు బొకే బదులుగా మొక్కలు ఇచ్చే సంస్కృతిని తీసుకొచ్చారు. శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ వారికి 45 ఔషధ గుణాలున్న మొక్కలను ఉచితంగా అందజేశారు. ప్రకృతిని కాపాడుతున్న కొత్తగూడెం టౌన్ రామవరం ప్రాంతానికి చెందిన మొక్కల వెంకటయ్య మనందరికీ ఆదర్శమే..!
News April 11, 2025
పాడేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

పాడేరు మండలం మినుములూరు రహదారి మార్గంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై పాడేరు వెళ్తున్న చిరు వ్యాపారిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలబడేవని పోలీసులు చెబుతున్నారు.
News April 11, 2025
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందించాలని, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.