News November 26, 2025

అల్లూరి: రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించండి

image

గ్రామ సభలో, రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. సహాయ కలెక్టర్ సాహిత్‌తో కలిసి బుధవారం పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ సంబంధించిన రెవిన్యూ సమస్యలపై మండల తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

మంగళగిరి: ‘లోకేశ్ తన పర్యటనలకు సొంత నిధులనే వాడుతున్నారు’

image

మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలపై వచ్చిన కథనాలపై సురేష్‌బాబు అనే వ్యక్తి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించారు. లోకేశ్ ఇప్పటివరకు పర్యటించిన విమాన చార్జీల‌కు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అధికారులు వెల్లడించినట్లు సురేష్‌బాబు తెలిపారు. ప‌ర్య‌ట‌న‌లకు సొంత సొమ్మునే ఆయన వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ పై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని టీడీపీ నేతలు హెచ్చరించారు.

‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్‌.. స్పందించిన హీరోయిన్

image

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్‌లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.