News April 22, 2025

అల్లూరి: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదోతరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. అల్లూరి జిల్లాలో 258 పాఠశాలల నుంచి 11,766 మంది పరీక్ష రాయగా వారిలో 5,476 మంది బాలురు, 6,290 బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 11,564 మంది కాగా ప్రైవేట్‌గా 202 మంది పరీక్ష రాశారు. 71 సెంటర్లలో పరీక్షలు జరగ్గా తెలుగు మీడియం 8,140, ఇంగ్లిష్ మీడియం 3,626 మంది ఉన్నారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

Similar News

News April 22, 2025

హిందీ ఇంపోజిషన్‌: ఫడణవీస్ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్లు

image

హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ ఇంపోజిషన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూసి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భయపడ్డారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మహారాష్ట్రలో కేవలం మరాఠీ తప్పనిసరంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా చెప్పిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే మూడో భాషా బోధన తప్పనిసరి కాదంటూ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.

News April 22, 2025

ఒక్కరోజే రూ.2,750 పెరిగిన తులం బంగారం

image

బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.

News April 22, 2025

అది చిన్ని బినామీ కంపెనీ: కేశినేని నాని

image

AP: విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు కేటాయించడాన్ని విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినాని నాని తప్పుబట్టారు. అది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అని ఆరోపించారు. రూ.5,728 కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అనుభవం, క్రెడిబిలిటీ ఆ సంస్థకు లేదన్నారు. వెంటనే భూ కేటాయింపులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబును కోరారు.

error: Content is protected !!