News March 21, 2024
అల్లూరి: ‘సింగిల్ విండో విధానంలో అనుమతులు’

పొలిటికల్ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని జేసీ భావన వశిస్ట్, ITDA పీఓ వి.అభిషేక్ అన్నారు. పాడేరు కలెక్టరేట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాలకు ఎన్నికల పోర్టల్స్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సువిధ యాప్ నుండి దరఖాస్తులు స్వీకరించి, ఎన్కోర్ యాప్ నుంచి అనుమతులు జారీ చేస్తామన్నారు. రిటర్నింగ్ అధికారుల ఆమోదం లేకుండా ఎటువంటి అనుమతులు జారీ చేయకూడదన్నారు.
Similar News
News April 20, 2025
40,132 మందికి గ్యాస్ సబ్సిడీ విడుదల: జేసీ

రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని 40,132 మంది లబ్దిదారులకు విడుదల చేశామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వారిలో 26,651 లబ్దిదారులకు రూ.2,11,06,884 బ్యాంకు అకౌంట్లలో జమైందన్నారు. మిగతావారికి త్వరలో సబ్సిడీ మొత్తం జమవుతుందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని హెచ్చరించారు.
News April 19, 2025
పోర్టు పరిసర ప్రాంతాల యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ

పోర్టు పరిసర ప్రాంతాల యువతకు ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రీషియన్, C.N.C. ఆపరేటర్, C.N.C. ప్రోగ్రామర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు C.E.M.S. ప్రోగ్రాం మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ హెడ్ ప్రజిత్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పోర్టు, C.E.M.S. సంయుక్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ శిక్షణ ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వారికి ఉపాధి కల్పిస్తామన్నారు.
News April 19, 2025
విశాఖ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం.. నా అదృష్టం: మేయర్

జీవీఎంసీలో నాలుగు వసంతాలపాటు మేయర్‌గా పదవిని బాధ్యతతో నిర్వర్తించినందుకు చాలా సంతృప్తినిచ్చిందని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శనివారం ద్వారా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ నాలుగు సంవత్సరాలలో ఎంతో జఠిలమైన సమస్యలను పరిష్కరించామన్నారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి కార్పొరేటర్‌కు వారి వార్డులో నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షతను చూపలేదన్నారు.