News December 31, 2025

అల్లూరి: ‘స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి’

image

అల్లూరి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.

Similar News

News December 31, 2025

2025: గోల్డ్‌ ₹57వేలు, వెండి ₹1.6L పెరిగింది!

image

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. JANలో 10gల బంగారం ధర ₹78,000 ఉండగా.. డిసెంబర్ 31న ₹1,35,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78%(₹57k) లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో ₹98,000 ఉండగా ప్రస్తుతం ₹2.58 లక్షలకు చేరుకొని 150%(₹160k) పైగా వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ ధరలెలా ఉంటాయో చూడాలి.

News December 31, 2025

NLG: ఆ జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలు

image

అసెంబ్లీ ఓటర్ల జాబితాతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుంది. 2023, OCT1 నాటికి ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని కమిషనర్లను EC ఆదేశించింది. దీంతో కమిషనర్లు మంగళవారం వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజించారు. బుధవారం పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడంతో పాటు ఆయా కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు.

News December 31, 2025

పల్నాడు: ఆ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి

image

2025 ఏడాది జిల్లాలో ఎన్నో ఏళ్లు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ప్రగతి కనిపించింది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఊరిస్తున్న వరకపూడి శెలకు సంబంధించి భూసేకరణకు అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు చెల్లించింది. మాచర్ల ఎత్తిపోతల అభివృద్ధికి సంబంధించి జిప్‌లైన్‌ పనులను కోటి రూపాయలతో ప్రారంభించారు. నాగార్జునసాగర్ పర్యాటకానికి కేంద్రం దర్శన్ 2.0లో రూ.25 కోట్లు కేటాయించారు.