News March 24, 2025

అల్లూరి: 10th లెక్కల పరీక్షకు 104 మంది దూరం

image

అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన 10th లెక్కల పరీక్షకు మొత్తం 11665మంది హాజరు కావాల్సి ఉండగా 11561మంది హాజరయ్యారని, 104 మంది గైర్హాజరయ్యారని DEO. బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. అరకువాలీ, అనంతగిరి మండలాల్లో పలు పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి కాపీయింగ్ ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని, జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్ష జరిగిందని తెలిపారు.

Similar News

News March 26, 2025

నేనెప్పటికీ నాగ్ అభిమానినే: సౌబిన్ షాహిర్

image

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్‌లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్‌ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.

News March 26, 2025

వనపర్తి: ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త..!

image

> ఆరు బయట పని చేస్తుంటే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోండి.> పిల్లల్ని ఎండలో ఆడనివ్వకపోవడమే మంచిది.> ఎండలో ఎక్సర్‌సైజ్‌లు చేయొద్దు.> కండరాల్లో, కడుపులో నొప్పి వస్తుంటే ఎండ వల్ల కావచ్చు.> తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దు.. ఒకవేళ వెళ్లిన లేదా రంగు దుస్తులు ధరించండి. టోపీ, గొడుగు వంటివి వెంట తీసుకెళ్లండి.> దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండండి.

News March 26, 2025

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర తెలిపారు. ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7- 2025 సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రదానం చేయడానికి అర్హతలతో దరఖాస్తులు కోరుతోందిని వివరించారు. ఏప్రిల్ 15లోపు చేనేత నుంచి HYDలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

error: Content is protected !!