News February 28, 2026
అల్లూరి: 2 నుంచి సార్వత్రిక విద్యా పీఠం ఇంటర్ పరీక్షలు

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 8.30కే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అన్ని కేంద్రాల్లో 163 సెక్షన్ అమలులో ఉంటుందని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
Similar News
News March 2, 2026
NRPT: ప్రజావాణిలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
News March 2, 2026
NGKL: లైసెన్స్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి

నాగర్‌కర్నూల్ జిల్లా లైసెన్స్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా, భద్రతను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, దినేష్ మల్లికార్జున్, అరవింద్, శివుడు ప్రశాంత్, శ్రీకాంత్, రమేష్, సుమంత్ సర్వేయర్లు పాల్గొన్నారు.
News March 2, 2026
ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.


