News September 6, 2025
అల్లూరి: 3.63 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం

పాడేరు మండలం కరకపుట్టు జంక్షన్ వద్ద 3.63 కిలోల హాషిస్ ఆయిల్ స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ కె.సురేష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు కరకపుట్టు జంక్షన్ వద్ద మాటు వేయగా 4 ప్యాకెట్లులో హాస్ ఆయిల్(గంజాయి లిక్విడ్) పట్టుబడిందన్నారు. ఈ ఘటనలో అలగం గ్రామానికి చెందిన వండలం చిన్నబాలన్నను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు వండలం కృష్ణారావు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 6, 2025
ఒంగోలు: 12న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 12వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత వహిస్తారని, ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభించడం జరుగుతుందన్నారు. సమావేశానికి అధికారులందరూ హాజరుకావాలని ప్రకటన ద్వారా కోరారు.
News September 6, 2025
చోడవరం జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు దొరికారు

చోడవరం సబ్ జైలు నుంచి శుక్రవారం పరారైన ఇద్దరు <<17624302>>ఖైదీలను<<>> విశాఖ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. చోడవరం సబ్ జైలులో ఖైదీలుగా ఉన్న బెజవాడ రాము, నక్క రవికుమార్ జైలు వార్డెన్‌పై దాడి చేసి తప్పించుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ సిటీలో కాంప్లెక్స్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో CI భాస్కరరావు, అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టుకొని చోడవరం పోలీసులకు అప్పగించారు.
News September 6, 2025
ఇండియా నుంచి ఏడుగురు.. అందులో మహబూబాబాద్ టీచర్

అమెరికాలోని FTEA ప్రోగ్రామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఇండియా నుంచి ఏడుగురు ఎంపికవగా అందులో ఒకరు MHBD జిల్లా మరిపెడ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు సోన్‌బన్ ఆంథోనీ డిసౌజా ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అక్తర్ ఈరోజు తెలిపారు. TGT (ఇంగ్లిష్) టీచర్ సోన్‌బన్ నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో ఫాల్-2025 ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారన్నారు.