News April 4, 2025
అల్లూరి: 5302 టెన్త్ పేపర్స్ మూల్యాంకనం

అల్లూరి జిల్లా కేంద్రం అయిన పాడేరులో పదోతరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ గురువారం ప్రారంభమైంది. వివిధ సబ్జెక్ట్స్‌కు చెందిన 5302 పేపర్స్ దిద్దినట్లు DEO బ్రహ్మాజీరావు మీడియాకు తెలిపారు. ఇంగ్లిష్ 1533, మ్యాథ్స్ 870, ఫిజికల్ సైన్స్ 994, బయలాజికల్ సైన్స్ 1120, సోషల్ స్టడీస్ 785 పేపర్స్ మూల్యాంకనం చేసినట్లు చెప్పారు. మొత్తం 370 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.
Similar News
News April 10, 2025
శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.
News April 10, 2025
FLASH..శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బేగంపేట్ ప్రగతి భవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.
News April 10, 2025
గుజరాత్‌లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రులు

గుజరాత్‌లోని సత్పురా, వింధ్యాచల్ పర్వత శ్రేణుల్లోనూ నర్మదా నది తీరంలో.. కెవాడియా ప్రాంతంలోఉన్న సర్దార్ వల్లబాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు.