News July 5, 2025
అల్లూరి: 90% సబ్సిడీపై 24,000 క్వింటాళ్ల వరి విత్తనాలు

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో గిరిజన రైతులకు 24,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఖరీఫ్ సీజన్‌లో పంపిణీ చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.బి.యస్ నంద్ శనివారం తెలిపారు. రాజ్ మా 4500, రాగులు 141, అపరాల విత్తనాలు 364, వేరుశెనగ 648 క్వింటాళ్లు అందజేశామన్నారు. జిల్లాలో దాదాపు 61,000 హెక్టర్లలో వరి పంట సాగు అవుతోందని వెల్లడించారు.
Similar News
News July 5, 2025
అనుష్క ‘ఘాటీ’ విడుదల వాయిదా

అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటీ’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 11న విడుదల చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించగా, పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ప్రేక్షకులకు మరింత ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్ని పంచేందుకు సినిమాను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామంది.
News July 5, 2025
స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సమాచార ఏర్పాటు చేసుకోవాలని SP వకుల్ జిందాల్ కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమైనదని అన్నారు. ముందస్తు సమాచారం సేకరించేందుకు సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
News July 5, 2025
ములుగు: నవోదయ ప్రవేశ పరీక్ష కరపత్రం ఆవిష్కరణ

నవోదయ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కరపత్రాన్ని ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, నవోదయ ప్రిన్సిపల్ పూర్ణిమ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు www.navodaya.gov.in వెబ్సైట్‌లో ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.