News February 18, 2026

అల్లూరి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జ్‌షీట్!

image

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా ఆ ఛార్జ్ షీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.

Similar News

News February 18, 2026

బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

image

బంగాళాదుంపలో బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.

News February 18, 2026

NZB: ‘భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి’

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలుకకుండా, అందరికీ ఒకే ఉచిత విద్యా విధానాన్ని రూపొందించాలని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. NZBలో బుధవారం ప్రారంభమైన AISF రాష్ట్ర 4 మహాసభల్లో ఆయన మాట్లాడారు. భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు.

News February 18, 2026

AIతో కొత్త మతాలు.. మిషనరీలు: హరారీ

image

దావోస్‌లో నిఖిల్ కామత్‌తో జరిగిన చర్చలో ప్రముఖ చరిత్రకారుడు యువల్ నోవా హరారీ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో AI కొత్త మతాలను సృష్టించడమే కాకుండా, సొంత మిషనరీలను కూడా కలిగి ఉండొచ్చని అంచనా వేశారు. మతగ్రంథాల సారాంశాన్ని విశ్లేషించడంలో మనుషుల కంటే AI మెరుగ్గా ఉంటుందని తెలిపారు. భక్తుల ప్రశ్నలకు నేరుగా సమాధానమిస్తుందని పేర్కొన్నారు.