News December 24, 2025

అల్లూరు జిల్లాలో విషాదం.. క్రిస్మస్ పండుగకు ఇంటికి వెళుతుంటే..

image

చింతూరు(M)లో పంచాయతీ కార్యదర్శులుగా చేస్తున్న <<18661155>>గెడ్డం సందీప్, పెయ్యల విద్యాసాగర్<<>> బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు గురువారం క్రిస్మస్ పండుగ అని అమలాపురం ఇంటికి వెళుతుండగా ఐ.పోలవరం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై తోటి ఉద్యోగులు శోకసంద్రంలో ఉన్నారు. జిల్లా అధికారులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

వనపర్తి: రైతుబంధు ఇప్పట్లో లేనట్లే: మాజీ మంత్రి

image

రైతుబంధు ఇప్పట్లో లేనట్లే అని బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంత తొందర తేలిపోతుందని ఎవరు ఊహించలేదని, అలాగే ఇప్పటివరకు వేయవలసిన రైతుబంధు ఇంకా వేయలేదని, ఎన్నికలు వస్తే తప్ప వారు వేయరని విమర్శించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో BRS భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు.

News December 26, 2025

మానసిక సంతృప్తే నిజమైన సంతోషం: మోహన్ భాగవత్

image

AP: మనిషికి నిజమైన సంతోషం మానసిక సంతృప్తిలోనే ఉందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మనిషికి సుఖదుఃఖాలు తాత్కాలికమని, ఎంత సంపాదించినా మనసుకు తృప్తి లేకపోతే ఆనందం ఉండదని అభిప్రాయపడ్డారు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. సరైన మార్గంలో పయనిస్తే లక్ష్యం తప్పక చేరుతామని స్వామి వివేకానంద నిరూపించారన్నారు.

News December 26, 2025

కరీంనగర్: స్థానిక ఖర్చు.. రికవరీ అయ్యేనా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి వారం గడిచింది. కొందరు గెలిచారు.. కొందరు ఓడారు. అయితే గెలిచినా.. ఓడినా ఇద్దరిది ఒకే బాధ. డబ్బులు ఎలా రికవరీ చేసుకోవడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు అంచనాలను మించి భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఓడిన అభ్యర్థులు డబ్బులు గంగపాలు అనుకుంటే.. గెలిచిన అభ్యర్థులు ఇవి రికవరీ అయ్యేనా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.