News August 25, 2025

అల్వాల్: Way2News Impact.. మరమ్మతులు

image

అల్వాల్ పరిధిలోని హెల్తీ బ్రెయిన్ ఆస్పత్రి నుంచి గోపాల్ నగర్ వెళ్లే మార్గంలో రోడ్డు గుంతల మయంగా మారి, అధ్వానస్థితికి చేరిందని ఆదివారం Way2News ఓ కథనాన్ని రాసింది. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. అనేక చోట్ల గుంతలను సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చి వేసినట్లు పేర్కొన్నారు. వెంటనే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News August 25, 2025

ఆశాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: హరీశ్ రావు

image

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డిమాండ్ల సాధనకై ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశా వర్కర్ల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష పాల్గొన్నారు.

News August 25, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.

News August 25, 2025

శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్

image

ప్రకాశం జిల్లా పునర్విభజన నేపథ్యంలో తెరపైకి సరికొత్త డిమాండ్ వచ్చింది. శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుతూ సంతకాలు సేకరించారు. ‘మార్కాపురానికి దగ్గర శ్రీశైలం ఉంది. ఇక్కడి గిరిజనులకు మార్కాపురంతో అనుబంధం ఉంది. వెలిగొండ, శ్రీశైలం ప్రాజెక్టులతో భవిష్యత్తులో నీటి వివాదాలు వస్తాయి. వీటికి పరిష్కారంగా శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలి’ అని TDP నేత కందుల రామిరెడ్డి కోరారు.