News October 13, 2025
అవంతి అడుగులు ఎటువైపో?

YCPహయాంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ చేతిలో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. TDP, జనసేనలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. YCPమేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆయన కుమార్తె ప్రియాంక(కార్పొరేటర్)ఓటే కీలకమయ్యిందన్న చర్చ నడిచింది. అయినా కూటమి పార్టీలు అవంతిని పట్టించుకోకపోవడం విశేషం. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటివరకు 3పార్టీలు మారారు.
Similar News
News October 14, 2025
SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.
News October 14, 2025
ములుగు: పర్యవేక్షణ బాధ్యత పొంగులేటికి సీఎం అప్పగించారు: సీతక్క

మేడారం జాతర పనుల పర్యవేక్షణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని సీతక్క అన్నారు. సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గద్దెల విస్తరణలో భాగంగా గ్రామస్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని, మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు పూర్తి చేస్తున్నామన్నారు.
News October 14, 2025
శామీర్‌పేట్: కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేశ్ కిషోర్ అనే అడ్వకేట్ షూ విసరడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తులకు రక్షణ కరవైందన్నారు.