News February 8, 2026

అవంతి శ్రీనివాస్ మళ్లీ వైసీపీ గూటికే చేరనున్నారా?

image

విశాఖ జిల్లాలో YCP మాజీ నేతల రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మళ్లీ ‘ఫ్యాన్’ నీడకే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీఎంపీ MVV.సత్యనారాయణ యాక్టివ్ కానున్నట్లు సమాచారం. గౌరవం, గుర్తింపు దక్కే చోటకే వెళ్లాలని వీరు భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ నేతల పునరాగమనం జిల్లా రాజకీయాల్లో కీలకం కానుంది.

Similar News

News February 9, 2026

తీరు మారకపోతే కఠిన చర్యలు: విశాఖ కలెక్టర్

image

కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన PGRSలో భాగంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా వినతుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న టీపీవో-6కి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరును నెల రోజులు సూక్ష్మంగా పరిశీలిస్తానని, తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 8, 2026

విశాఖ: కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

image

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.

News February 8, 2026

కేజీహెచ్ జీఎన్ఎం పరీక్షలో మాస్ కాపీయింగ్.. ముగ్గురు డిబార్

image

విశాఖ కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కౌన్సిల్ డైరెక్టర్ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.