News August 29, 2025
అవకతవకలకు పాల్పడితే స్పాట్‌లోనే సస్పెండ్: పొంగులేటి

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో యూరియా సరఫరాపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇకపై నియోజకవర్గంలో రైతులకు యూరియా ప్యాక్స్ కేంద్రాల ద్వారా మాత్రమే అందజేయాలని సూచించారు. అవకతవకలు జరిపిన వారిని స్పాట్‌లోనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అక్రమ రవాణా నివారణకు పోలీస్ బందోబస్తు, అదనపు సబ్‌సెంటర్ల ఏర్పాటు, ఆధార్, పాస్‌బుక్ ఆధారంగా ఎకరాకు ఒక బ్యాగ్ చొప్పున పంపిణీ చేయాలన్నారు.
Similar News
News August 29, 2025
HYDలోని డిఫెన్స్ ల్యాండ్స్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష

జిల్లాలో గుర్తించిన డిఫెన్స్ ల్యాండ్స్‌కు సంబంధించిన నివేదికలను వారంలో అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్ MLA కౌసర్ మోహియుద్దీన్,
నాంపల్లి MLA మాజీద్ హుస్సేన్, MLC మీర్జా రహమత్ బేగ్‌తో కలసి ఆసిఫ్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్‌పేట్‌లో గుర్తించిన డిఫెన్స్ భూములపై సమీక్షించారు.
News August 29, 2025
పాలమూరు: ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమావేశం

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, పంచాయితీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అంటించామని చెప్పారు.
News August 29, 2025
చెన్నూరు: ‘మెరుగైన సేవలను అందించాలి’

చెన్నూరు మండలంలోని సబ్ స్టేషన్లను మంచిర్యాల డివిజన్ SE ఉత్తమ్ పరిశీలించారు. కొమ్మెర, రచ్చపల్లి, ఆస్నాద్ సబ్‌స్టేషన్‌లలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. LC తీసుకునే సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆపరేటర్ సేఫ్టీ కిట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. సబ్‌స్టేషన్ మెయింటెనెన్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.