News November 20, 2024

అవకతవకల వల్లే విశాఖ డెయిరీకి నష్టాలు: పల్లా

image

సుమారు రూ. 2000 కోట్ల టర్నోవర్ కలిగిన విశాఖ డెయిరీలో జరుగుతున్న అవకతవకల వల్లే డెయిరీకి నష్టాలు వస్తున్నాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సొసైటీగా ఉన్న డెయిరీని కంపెనీగా మార్పు చేసినప్పటి నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. డెయిరీకి అనుబంధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ‌ రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు మళ్లిస్తున్నారని అన్నారు.

Similar News

News July 8, 2025

ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

image

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

News July 8, 2025

గిరి ప్రదక్షిణకు మహా ‘గట్టి’ ఏర్పాట్లు సుమా..!

image

గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హనుమంతువాక నుంచి వెంకోజీపాలెం వరకూ జాతీయ రహదారిపై పాదచారుల కోసం చేసిన ఏర్పాటు చూస్తే.. చిన్న పాటి కర్ర పాతి, దానికి సన్నని రిబ్బన్ కట్టి, వాహనాలు ఇటు రాకుండా, పాదచారులు అటు వెళ్లకుండా విభజన చేశారు. లక్షల్లో నడిచే ఈ దారిలో ట్రాఫిక్ కూడా ఎక్కువే. ఇంత ‘గట్టి’ ఏర్పాట్లు చేసిన అధికారులను ఎలా అభినందించాలో తెలియడం లేదంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.

News July 8, 2025

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

image

విశాఖ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ మెమో ఉత్తరులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మెమో పత్రాలను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ సంఘాల నాయకులకు డీఈవో ప్రేమ్ కుమార్ అందజేశారు. దీనిపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.