News January 7, 2026

అవకాడో సాగుకు అనువైన వాతావరణం

image

అవకాడో ఉష్ణమండల లేదా ఉపఉష్ణమండల వాతావరణంలో పెరిగే వృక్షం. కానీ చల్లని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా పెంచవచ్చు. అవకాడోను పండించడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 25- 33°C మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలమైనది. ఒకసారి మొక్క ఎదిగిన తర్వాత, చెట్లు (28°F) వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు, కాని లేత మొక్కలు గడ్డకట్టే ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అవకాడోకు బాగా పొడిగా ఉండి నీరు నిలవని, గాలి బాగా ప్రసరించే నేల అవసరం.

Similar News

News January 8, 2026

భారత మాజీ కోచ్‌లపై కన్నేసిన శ్రీలంక

image

T20 WCలో రాణించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు పలు కీలక నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ను అపాయింట్ చేసుకున్న ఆ జట్టు, తాజాగా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌నూ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. JAN 18 నుంచి MAR 10 వరకు ఆయన SL జట్టుకు కోచ్‌గా ఉండనున్నారు. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుంది. కాగా IPLలో RR టీమ్‌కు విక్రమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.

News January 8, 2026

ఇమ్యునిటీని పెంచే బ్రేక్ ఫాస్ట్

image

అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి గుడ్లు, చిలగడదుంప, ఓట్స్ అంటున్నారు నిపుణులు. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్, ఫైబర్, బీటా-గ్లూకాన్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ ఈ, చిలగడ దుంపలో కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి.

News January 8, 2026

పాతబస్తీ మెట్రో పనులపై పీపీటీ ఇవ్వండి: హైకోర్టు

image

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చారిత్రక నిర్మాణాలు దెబ్బతినేలా మెట్రో ఫేజ్-2 పనులు చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌ను కోర్టు విచారించింది. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. దీనిపై పీపీటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పగా, అందుకు ధర్మాసనం అంగీకరించింది.