News February 6, 2025
అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ: అనకాపల్లి ఎస్పీ
ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రహదారి భద్రత మాసోత్సవాలు జిల్లాలో ఈ నెల 16 వరకు జరుగుతాయన్నారు. పలుచోట్ల రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.
Similar News
News February 6, 2025
ఉయ్యూరు వీరమ్మ తల్లి @ 500 ఏళ్ల చరిత్ర
500 ఏళ్ల చరిత్ర గల వీరమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పెదకడియం గ్రామంలో జన్మించి భర్త చింతయ్య హత్యకు గురికావడంతో సతీసహగమనం చేసింది. భర్త హత్యకు కారణమైన కరణం సుబ్బయ్య వంశం నిర్విర్యమైంది. ఉయ్యూరులో ఆమెకు ఆలయం నిర్మించి, ఏటా మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఉయ్యాల ఊయింపు ప్రత్యేక సంప్రదాయం. లక్షలాది మంది భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొంటారు.
News February 6, 2025
కృష్ణాజిల్లా క్రీడాకారిణికి సీఎం ప్రశంసలు
కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన క్రీడాకారిణి గాయత్రీని CM చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం రాత్రి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ నేషనల్ గేమ్స్ కాన్ స్లాలోమ్ మహిళా విభాగంలో గాయత్రి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా CM చంద్రబాబు గోల్డ్ మెడల్ సాధించడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
News February 6, 2025
పార్వతీపురం: మొన్న మూడు.. నిన్న నిల్..!
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిట్టింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.