News January 5, 2026

అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

image

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.

Similar News

News February 19, 2026

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు దారుణాలు

image

మదనపల్లె హత్యాచార <<19180501>>ఘటన<<>> మరువకముందే తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు దారుణాలు చోటుచేసుకున్నాయి. HYD నార్సింగి PS పరిధిలో ఓ బాలికపై రౌడీ షీటర్లు సామూహిక అత్యాచారం చేశారు. బాలికకు గంజాయి తాగించి అఘాయిత్యం చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు విశాఖ(D) పెదగంట్యాడలో 3ఏళ్ల చిన్నారిపై యోగి అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News February 19, 2026

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

image

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.

News February 19, 2026

ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

image

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?