News January 2, 2026

అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దు: జిల్లా కలెక్టర్

image

రైతులు ఎవరు ప్రస్తుత అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతం అధికంగా కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటే యూరియా యొక్క నాణ్యత దెబ్బ తిని పంట నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. యూరియా కోసం రైతులు ఏ సమయంలో రావాలో వారికి ముందస్తుగానే సమాచారం అందిస్తూ కూపన్లు కూడా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 9, 2026

ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

News January 9, 2026

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బంకుల వద్ద భద్రత కోసం ఇరువైపులా 100 మీటర్ల మేర బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News January 9, 2026

ఎల్బీనగర్ – ఖమ్మం మధ్య ప్రత్యేక బస్సులు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్బీనగర్ నుంచి ఖమ్మంకు నేడు, రేపు ప్రత్యేక నాన్-స్టాప్ డీలక్స్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10:30 గంటల వరకు మొత్తం 8 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.