News May 20, 2024
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: కలెక్టర్

జూన్ 4న కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులతో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. అధిక మొత్తంలో బాణా సంచా విక్రయాలు చేపట్టవద్దని హోల్ సేల్ డీలర్స్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అధికారుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.
News April 23, 2025
10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
News April 23, 2025
డిప్యూటీ మేయర్ పదవి ఎవరిని వరించేనో?

మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా గుంటూరులోని అధికార పార్టీ నేతల్లో డిప్యూటీ మేయర్ ఆశావాహుల సందడి మొదలైంది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి నాని పేరు ఇప్పటికే అధిష్టానం ఖరారు చేయగా, డిప్యూటీ మేయర్ విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. బీసీ వర్గానికి చెందిన యల్లావుల అశోక్ పేరు గట్టిగా వినిపిస్తుండగా, ఇన్‌ఛార్జి మేయర్ సజీల మేయర్ ఎన్నిక తర్వాత పాత పదవిని కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.