News November 29, 2024

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: ఎస్పీ

image

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆత్మకూరులో జరగబోయే ఉమామి తబ్లిగే ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పార్కింగ్‌కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. హెల్ప్ డిస్క్ కూడా ఏర్పాటు చేస్తామని, ఏదైనా సహాయం కావాలంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు.

Similar News

News October 4, 2025

1100కు ఫోన్ చేయండి: కలెక్టర్

image

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని లెక్టర్ సిరి శనివారం వెల్లడించారు. అర్జీదారులు meekoస్am.ap.gov.in వెబ్ సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మండల కేంద్రంలో, మున్సిపాల్టీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 4, 2025

ఎస్సీ,ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందించండి: కలెక్టర్

image

ఎస్సీ,ఎస్టీ కేసులు బాధితులకు పరిహారం అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాధితులకు పరిహారం అందించాలన్నారు.

News October 3, 2025

జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అంగన్వాడీల అభివృద్ధికి రూ.35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.95 లక్షలు, పాఠశాలల అభివృద్ధికి రూ.20 లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిర్దేశించిన కాల వ్యవధిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.