News December 13, 2025
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: DGP

<<18552173>>కోల్‌కతా ఘటన<<>> నేపథ్యంతో HYD ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు DGP శివధర్ రెడ్డి తెలిపారు. ‘కోల్‌కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్‌లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో CM, మెస్సీ మ్యాచ్ ఉంటుంది’ అని తెలిపారు.
Similar News
News December 20, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్‌లో <
News December 20, 2025
మస్క్‌కు 55 బి.డాలర్ల ప్యాకేజీకి కోర్టు గ్రీన్ సిగ్నల్!

టెస్లా 2018లో మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల ప్యాకేజీని కోర్టు పునరుద్ధరించింది. గతంలో ఓ కోర్టు దీన్ని రద్దు చేయగా ఇప్పుడు డెలావేర్ కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కంపెనీని నిర్దేశిత లక్ష్యాలకు చేర్చారన్న పేరిట మస్క్‌కు సన్నిహితులైన బోర్డు సభ్యులు ప్యాకేజీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఒక వాటాదారు కోర్టుకు వెళ్లారు. తాజా తీర్పుతో మస్క్ ఆస్తి 679 బి.డాలర్లకు చేరుతుంది.
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు ఎందుకొస్తాయంటే?

గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు తరచూ చాలా మంది కాళ్లలో వాపు వస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. మెల్లగా కాకుండా ఒక్కరోజులోనే కాళ్లు బాగా వాచిపోవడం, నొక్కితే సొట్ట పడిన తర్వాత అది మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడినప్పుడు జాగ్రత్త పడాలి. రెండుకాళ్లు కాకుండా ఒక కాలే వాస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


