News February 28, 2025

అవార్డులు అందుకున్న అంబాజీపేట శాస్త్రవేత్తలు

image

అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తల బృందం గురువారం జీవవైవిధ్య నియంత్రణలో విశిష్ట విస్తరణ కార్యానికి చండీస్ ఆర్ బలాల్ పురస్కారం అందుకున్నారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో సైంటిస్టులు చలపతిరావు, నీరజ, గోవర్ధనరావు, కిరీటి, అనూష, సునీత బృందానికి ఈ అవార్డు అందజేశారు. కొబ్బరి, కోకోలో జీవ నియంత్రణ పద్ధతులతో పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై చేసిన పరిశోధనలకు గుర్తింపు లభించిందన్నారు.

Similar News

News January 10, 2026

VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

image

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.

News January 10, 2026

NGKL జిల్లాలో 1,036 టన్నుల యూరియా నిల్వలు!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 1,036 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. యాసంగి 2025 సీజన్‌లో 17,992 టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సీజన్లో మిగతా మూడు నెలలకు 37,447 టన్నుల యూరియా ఇండెంట్ కోసం పై అధికారులకు సిఫార్సులు చేశామన్నారు. సోమవారం నుంచి వివిధ మార్గాల ద్వారా జిల్లాకు యూరియా సరఫరా అవుతుందన్నారు.

News January 10, 2026

చిన్నకోడూరు: విశ్వతేజకు ‘బాల రత్న’ పురస్కారం

image

అతి చిన్న వయసులోనే అద్భుతమైన కథలు రాస్తూ రాణిస్తున్న విద్యార్థి విశ్వతేజకు ‘బాల రత్న’ పురస్కారం దక్కింది. అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విశ్వతేజకు, హైదరాబాద్‌కు చెందిన కమలాకర ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. శుక్రవారం కలెక్టర్ హైమావతి విద్యార్థికి అవార్డు అందజేసి అభినందించారు. విద్యార్థి సృజనాత్మకతను కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.