News December 30, 2025
అవార్డ్ అందుకున్న ధర్మారం యువకుడు

ధర్మారం మండలానికి చెందిన కోలిపాక కుమారస్వామి తన జీరో బడ్జెట్‌తో “కళాకారుడు” అనే షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2025 అవార్డు అందుకున్నారు. 3 నిమిషాల చిత్రాన్ని 15 రోజుల్లో పూర్తిచేసి 500కుపైగా చిన్న సినిమాలను పోటీలో అధిగమించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, TGFDC ఛైర్మన్ దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు కుమారస్వామిని అభినందించారు.
Similar News
News January 2, 2026
కుడి ఎడమైతే.. పొరపాటు ఉందోయ్!

కేరళలో నిన్న BJP పేపర్ ‘జన్మభూమి’లో IUML పేపర్ ‘చంద్రిక’ కంటెంట్ వచ్చింది. ఉదయమే జన్మభూమి చదువుతూ, మధ్యలో BJPని తిట్టే కంటెంట్ చూసి కమల నేతలు ఆశ్చర్యపోయారు. ఇరు పేపర్ల కన్నూర్-కాసర్‌గోడ్ ఎడిషన్ ఒకే ప్రెస్‌లో ప్రింట్ అవుతుంది. అక్కడ పొరపాటున అవతలి పార్టీ కంటెంట్ ప్రింట్ అయిందని తర్వాత తెలిసింది. కాగా BJP-ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బ్యాక్ డోర్ దోస్తీని ఈ ప్రెస్ నిరూపించిందని CPIM విమర్శించింది.
News January 2, 2026
జల జగడంపై కమిటీ.. కేంద్రం నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున కమిటీలో సభ్యులు ఉండనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, NWDA, CWC సీఈలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.
News January 2, 2026
వ్యాపారస్తులకు ఉద్యమ్ సర్టిఫికెట్ తప్పనిసరి- PO

గిరిజన ప్రాంతంలో వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమల నిర్వాహకులు తప్పనిసరిగా ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ కావాలని ఐటిడిఏ పీఓ స్మరన్ రాజ్ అన్నారు. శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏలో అన్ని మండలాల వెలుగు ఏపీఎంలతో పీఓ సమావేశం నిర్వహించారు. ప్రతి వ్యాపారస్తులు ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కావాలని అధికారులకు పీవో సూచించారు. ఉద్యమ్ సర్టిఫికెట్ వల్ల వ్యాపారస్తులకు ఎంతగానో ఉపయోగంటుందని పీఓ అన్నారు.


