News September 12, 2025
అవాల్గావ్ గ్రామ శివారులో చిరుత సంచారం?

మద్నూర్ మండలం అవాల్గావ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గురువారం గ్రామ శివారులో రైతులు చిరుత పులి పాద ముద్రల ఆనవాళ్లను చూశారు. దీంతో భయభ్రాంతులకు గురై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులి ఆనవాళ్లను పరిశీలించారు. గ్రామస్థులు, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News September 12, 2025
పల్నాడు జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్ల

పల్నాడు జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియమితులయ్యారు. గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆమె పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో దిశ పర్యవేక్షణ ప్రత్యేక అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
News September 12, 2025
ఇప్పటి వరకు రూ.62.50లక్షలు ఇచ్చాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం రూ.3లక్షల పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్& రన్‌లో చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు,తీవ్ర గాయాలైన ఇద్దరికి రూ.50 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 77 మందికి రూ.62.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
News September 12, 2025
‘కిష్కింధపురి’ పబ్లిక్ టాక్

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. మూవీ చూసిన వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. హీరోహీరోయిన్ల యాక్టింగ్, విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ&రేటింగ్.