News December 24, 2025
అవినీతి జలగలు.. విశాఖలో అటెండర్ ఆస్తి తెలిస్తే షాక్!

నగరంలోని సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు కార్యాలయంలో పాటు అటెండర్, జూనియర్ అసిస్టెంట్ ఇళ్ళపైనా నిన్న ఏసీబీ దాడులు చేసింది. మోహన్ రావు ఇంట్లో లెక్కకు మించి ఆస్తులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా అటెండర్ ఆనంద్ కుమార్ ఇంటిలో రూ.కోటి విలువైన ఆస్తుల్ని గుర్తించారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ సుధారాణి ఇంట్లో కూడా కోటి రూపాయలు పైబడి స్థిర, చరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
Similar News
News December 29, 2025
పర్యాటక రంగంలో దూసుకుపోతున్న పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లా పర్యాటక రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్, అమరావతి దేవాలయం, ధ్యాన బుద్ధ, ఎత్తిపోతల జలపాతం, పులిచింతల, కొండవీడు, కోటప్పకొండ, గుత్తికొండ, దైద బిలం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధిలోకి రావడం విశేషం. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా బౌద్ధ సర్క్యూట్ ను ప్రోత్సహిస్తూ బుద్ధ వనం అభివృద్ధి చేయడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది.
News December 29, 2025
NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<
News December 29, 2025
VKB: భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

పరిగి RTC డిపో మేనేజర్ K.కృష్ణమూర్తి అరుణాచలగిరి ప్రదర్శన భక్తులకు శుభవార్త చెప్పారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలగిరి ప్రదక్షణ, జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి 3800/- నిర్ణయించారు. జనవరి 1న బయలుదేరి 4న తిరిగి చేరుతుందని వివరించారు.


