News August 7, 2024

అవినీతి నిరూపిస్తే తప్పుకుంటా: పీలేరు సర్పంచ్

image

తనపై <<13792038>>అవినీతి <<>>ఆరోపణలు నిరూపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమని పీలేరు సర్పంచ్ జీనత్ షఫీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచే పంచాయతీ అప్పుల్లో ఉంది. అయినా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నా. పార్టీలకు అతీతంగా బాధ్యతతో పాలన చేశా’ అని చెప్పారు. పీలేరు రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిన్న ఎంపీడీవో ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News January 12, 2025

కాణిపాకం: స్వామివారి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ

image

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చక్రవర్తి కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.

News January 11, 2025

చిత్తూరు: కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు,ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధమని SP మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఎవరైనా ఈ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాడ్పడినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని  హెచ్చరించారు. వీటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 11, 2025

BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

image

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.