News October 28, 2025
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత: కలెక్టర్

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 గోడపత్రికను కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ జి.రాజకుమారి, జేసీ కొల్లాబత్తుల కార్తీక్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, సమర్థత పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
Similar News
News October 29, 2025
NZB: పతకాలు గుర్తింపు కాదు.. నిబద్ధతకు ప్రతీక CP

పతకాలు సిబ్బందికి గుర్తింపు మాత్రమే కాదని, వారి సేవా స్ఫూర్తికి, కష్టపడి పని చేసే నిబద్ధతకు ప్రతీక అని నిజామాబాద్ CP సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 95 మందికి వచ్చిన వివిధ రకాల సేవా పతకాలను మంగళవారం ఆయన సీపీ కార్యాలయంలో ప్రదానం చేసి మాట్లాడారు. ప్రజల, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చూపుతున్న సేవా మనోభావం ప్రశంసనీయమైనదని ప్రశంసించారు.
News October 29, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: గద్వాల్, MBNR, NGKL, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HNK, HYD, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, WGL జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మీ ప్రాంతంలో వాన పడుతోందా?
News October 29, 2025
తీరం దాటిన తీవ్ర తుఫాన్

AP: మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం-కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రా.11:30 గంటల నుంచి రా.12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.


