News August 8, 2024

అవినీతి రహిత పాలనను అందిస్తా: కడియం

image

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. చిల్పూరు మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Similar News

News November 27, 2024

వరంగల్: పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా. మంగళవారం రూ.6,770కి పడిపోయింది. బుధవారం రూ.70 పెరిగి రూ. 6,840 అయింది. మార్కెట్లో ధరలు పెరుగుతూ తగ్గుతుండడంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.

News November 27, 2024

చలి తీవ్రతతో వణుకుతున్న ఓరుగల్లు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో చలి జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వయో వృద్ధుల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News November 27, 2024

వరంగల్ రీజియన్‌లో 170 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వరంగల్ రీజియన్‌లో 170 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.