News October 27, 2025
అవినీతి సంస్థ ఎదుగుదలను అడ్డుకుంటుంది: జీఎం రాజేశ్వర్ రెడ్డి

అవినీతి అనేది పని చేసే సంస్థ ఎదుగుదలను అడ్డుకుంటుందని, ప్రతి ఉద్యోగి నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తించాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025 కార్యక్రమాన్ని జీఎం ముఖ్య అతిథిగా, ప్రాజెక్ట్, ప్లానింగ్ జీఎం సాయిబాబు విశిష్ఠ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
HYD: డీప్‌ఫేక్ కేసులో విచారిస్తున్నాం: సీపీ

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. చిరంజీవి డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని, సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసే కేటుగాళ్లపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు.
News October 27, 2025
AI సాయంతో మ్యాథ్స్‌లో రఫ్ఫాడిస్తున్నారు!

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా విద్యార్థులు AI సాయంతో చదువులో అదరగొడుతున్నారు. ‘PadhaiWithAI’ ప్లాట్‌ఫామ్‌లో అభ్యసించేలా కలెక్టర్ సౌమ్య ఝా విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో కేవలం 6 వారాల్లో 10వ తరగతి గణితం పాస్ పర్సంటేజ్ 12% నుండి 96.4%కి పెరిగింది. ఇది సంప్రదాయ విద్యలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కలెక్టరే స్వయంగా విద్యార్థులపై శ్రద్ధపెట్టి పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది.
News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో త్వరలో రేవంత్ రెడ్డి ప్రచారం

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపు కోసం నాయకులు ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. 2రోజుల పాటు స్థానికంగా పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏఏ తేదీల్లో ప్రచారం చేయాలనేది గాంధీ భవన్ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.


