News January 30, 2025
అవి పట్టా భూములే: MP మిథున్ రెడ్డి

పట్టా భూములను అటవీ భూములుగా దుష్ప్రచారం చేయడం తగదని MPపెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. CM చంద్రబాబు కక్ష సాధింపుతోనే అనుకూల పత్రికలలో తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. వాటిని నిరూపించలేక పోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. తమకూ మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. జగిత్యాలకు ఏం కావాలంటే..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరగాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు టెంపుల్ డెవలప్‌మెంట్, చివరి ఆయకట్టు వరకు పంట పొలాలకు నీళ్లు, తాగునీటి సమస్య, నాణ్యమైన రోడ్లు, ముఖ్యంగా జిల్లాలోని గురుకుల పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 12, 2025
పంగులూరు జాతీయ రహదారిపై ప్రమాదం

బాపట్ల జిల్లా పంగులూరు మండలం రేణింగివరం జాతీయ రహదారి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి తిరుపతి వెళుతున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తుతో ముందు ఉన్న సిమెంటు లారీని ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉండగా వారిలో నలుగురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కోవడం వలన ఫ్రాక్చర్స్ అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News March 12, 2025
ఖమ్మం: పట్టుపట్టాడు.. కొలువులు సాధిస్తున్నాడు..

పట్టుదలతో ప్రభుత్వ కొలువులు సాధించుకుంటూ వస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు. తాజాగా గ్రూప్- 2లో 387 మార్కులతో స్టేట్ 148 ర్యాంక్, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. అతడే తల్లాడ మండలం మల్లవరంకు చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు. తొలి ప్రయత్నంలోనే 2018లో పంచాయితీ కార్యదర్శిగా, 2019లో FBOగా, 2020లో విద్యుత్ శాఖలో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కొలువులను వరుసగా సాధిస్తూ వచ్చాడు.