News January 8, 2026
అశ్లీల కంటెంట్ వివాదం.. గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!

మస్క్ నేతృత్వంలోని Xకు కేంద్ర IT శాఖ మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. Grok AI ద్వారా అశ్లీల చిత్రాలను సృష్టిస్తున్న ఉదంతంపై X సమర్పించిన నివేదిక సరిపోదని చెప్పింది. ఈ అశ్లీల కంటెంట్‌పై తీసుకున్న నిర్దిష్ట చర్యలు, భవిష్యత్తులో జరగకుండా చేపట్టే నివారణా మార్గాల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. భారత చట్టాలను గౌరవిస్తామని X చెబుతున్నా కచ్చితమైన వివరాలు సమర్పించాల్సిందేనని కేంద్రం ఆదేశించింది.
Similar News
News February 13, 2026
మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ విజయం

TG: మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లలో 45 స్థానాలను సొంతం చేసుకుంది. BRS 5, BJP ఒక డివిజన్‌లో గెలుపొందాయి. అటు నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. BRS ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోతోంది.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘నీల లోహిత’’

సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవుడి కోపం నుంచి శివుడు ఉద్భవించినప్పుడు ఆయన ‘నీల లోహిత’ రూపంలో ఉన్నాడు. ‘నీల’ అంటే ఆకాశం అంతటి నీలి రంగు, ‘లోహిత’ అంటే అగ్ని లాంటి ఎరుపు రంగు. అంటే సృష్టిలోని శాంతిని, అలాగే ప్రళయ కాలంలోని తీవ్రతను రెండింటినీ ఆయన తనలో కలిగి ఉంటారని దీని అర్థం. అర్ధనారీశ్వర రూపానికి ఇది మరో సంకేతం. నీలం రంగు జ్ఞానానికి చిహ్నం అయితే, ఎరుపు రంగు శక్తికి, క్రియాశీలతకు నిదర్శనం.
News February 13, 2026
పత్తి పంట తీసిన తర్వాత ఏం చేయాలి?

పత్తి తీత పూర్తయ్యాక తప్పనిసరిగా పంట విరామం పాటించాలి. ఈ సమయంలో పక్షులు వాలేలా Y ఆకారపు చెట్ల కొమ్మలను భూమిలో పాతి ఉంచడం వల్ల అవి పంటలకు సహజ శత్రువులైన పురుగులను తినే అవకాశం ఉంటుంది. పంట కోత తర్వాత పొలంలో తడి లేకుండా చూడాలి. లేకుంటే కింద పడిన కాయల్లో పురుగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంటుంది. పత్తితీత తర్వాత పొలాల చుట్టూ ఉన్న రోడ్లు, కాలువ గట్లు, పొలాల అంచుల్లో పత్తి మొక్కలను పూర్తిగా తొలగించాలి.


